అట్ల తద్ది @2022 చీర
భవాని అట్ల తద్ది కి చీర కొనుక్కోవాలి అంది. అలాగే వాళ్ల అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అంది. అత్తయ్య చీర కొనుక్కోమని 1000 రూపాయలు ఇచ్చింది. తనని తీసుకు వెళ్ళటానికి మావయ్య వచ్చారు. తను చాలా సంతోషించింది. చాలా రోజులు అయ్యింది ఇంటికి వెళ్లి 10 రోజులు వుంటాను అడిగింది. నేను కూడా ఉండమని చెప్పాను. ఇక ఆ రోజు సాయంత్రం కి మావయ్య వచ్చారు. భవాని చీర విజయవాడ లోనే కొనుకుంటాను shopping కి తీసుకొనివెళ్ళమంది. సరే అని బయలుదేరాము. శుభమస్తు shopping mall కి వెళ్ళాము. తను చీరలు చూస్తూ వుంది, నేను సుజీత్ ని చూసుకుంటున్న. సుజి బాబు అటు ఇటు పరుగు పెడుతున్నాడు. మధ్య మధ్య లో బొమ్మ కావాలి అని అడుగుతున్నాడు, మా అబ్బాయి కి ఎన్ని toys కొన్నా తనివి తీరదు. ఇక నేను కూడా మధ్య మధ్యలో చీరలు చూస్తున్న, తనకి ఒక చీర నచ్చింది అది నాకు కూడా నచ్చింది ఐతే ఇంకో type లో తీసుకోమని నేను సలహా ఇచ్చాను ఎందుకంటే ఆ type లో భవాని కి sarees ఎక్కువ లేవు కాని తను నన్ను convince చేసింది.భవాని select చేసిన saree నే తీసుకున్నాము, budget 1000 రూపాయలు కంటే కాస్త ఎక్కువే అయ్యింది. ఈ మధ్య ఒక joke చదివా ఆడవాళ్ళ తో వాదించటం ఒక software నో లేక ఒక ఆప్ నో ...