చిన్ను కి కొన్న చిన్న scooter బొమ్మ

 అప్పుడు MTS exam రాయటానికి విజయవాడ వచ్చాను,ఐతే  చిన్న అవగాహనా లోపం వలన exam లో సక్సెస్ అవ్వలేదు అది వేరే విషయం. Exam రాసి విజయవాడ నుండి బయలుదేరాను bike మీద, రోడ్ పక్కన ఒక toy shop కనపడింది వెంటనే bike ఆపి ఒక చిన్న toy  scooter కొన్నాను సుజి బాబు కోసమని, అప్పటికి బాబు కు తొమ్మిది, పది నెలల వయసు, అది చూసి బాబు చాలా happy feel అయ్యాడు. దాని తో బాగానే ఆడుకున్నాడు చిన్నోడు. నాకు చాలా ముచ్చ్చటేసింది. 100 రూపాయలు పెట్టి కొన్న బొమ్మ ఈ రోజు కు బానే వుంది. అప్పటి నుంచి ఎక్కడన్నా toys కనపడితే చిన్ను కు కొనిపెట్టాలని సరదా పడేవాడ్ని ఐతే చిన్ను కు రెండేళ్లు నిండి కాస్త ఊహ తెలిసాక నా చేత ఎన్ని బొమ్మలు కొనిపించుకొన్నాడో, ఒకానొక time(విజయవాడ షిఫ్ట్ ఐయిన కొత్తలో )లో రోజూ toy కొనమని మారాం చేసేవాడు ఇక అప్పుడు నాకు సరదా మొత్తం తీర్చేసాడు మా బుజ్జి బాబు.మొదట్లో  భవాని కూడా సుజి కి  ఏదయినా toy కొంటె ముచ్చ్చట పడేది,కాని రాను రాను అవి రెండు సంచులయ్యాక ఆవిడ సరదా కూడా తీరిపోయింది. సంచి లో బొమ్మలు అన్ని కింద వేస్తాడు లేకపోతే మంచం మీద వేస్తాడు ఒక ఐదు నిమిషాలు ఆడతాడు తర్వాత వాటిని వదిలేసి tv చూడటమో mobile చూడటమో చేస్తాడు, పాపం భవాని అవన్నీ తిరిగి సంచి లో వేసి పక్కన పెడుతుంది బాబు మళ్ళీ తీసి అవన్నీ కింద వేస్తాడు, భవాని కి ఇదొక extra work అయ్యిపోయింది పాపం.ఏదేమైనా మా బాబు కు toys అంటే ఇష్టం, తనకి అవి కొనివ్వటం మాకిష్టం,  రెండు సంచులు కాదు ఇరవై సంచులు ఐనా సరే. పిల్లల మానసిక వికాసం లో బొమ్మలు, ఆట వస్తువుల పాత్ర చాలానే ఉంటుంది కాబట్టి బొమ్మలు కొనివ్వటం తప్పేమి కాదు అనేదే మా అభిప్రాయం.

చిన్ను కి కొన్న చిన్న scooter బొమ్మ 


 


Comments

Popular posts from this blog

చలో KFC

కొన్ని జ్ఞాపకాలు

సాయంత్రం సరదాగా