చలో KFC

కొత్తగా విజయవాడ కు shift అయ్యాము. బహుశా అది september నెల 2022.చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మొదటి సారిగా మా ఇంటికి వచ్చింది విజయవాడ కు. చెల్లి ఇప్పటి వరకు మూడు  సార్లు వచ్చింది.మొదటిసారి ఇంట్లో కి దిగినప్పుడు పాలు పొంగించింది, రెండవసారి exam ఉందని వచ్చింది, ఇక మూడవసారి దసరా సెలవులు అని వచ్చింది. ఈ మూడుసార్లు ఎన్నో జ్ఞాపకాలు వున్నాయ్. అవి వేరే post లో రాస్తాను. ముఖ్యం గా ఈ post లో నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, నేను పిల్లలు ముగ్గుర్ని KFC కి తీసుకొని వెళ్లిన సంగతి. అక్షయ్ బాబు కి అంతకు ముందే KFC పరిచయం చేసాను, అప్పుడు కూడా పిల్లలు ముగ్గుర్ని తీసుకెళ్ళాను. ఆ రోజు night 8 దాటాక అక్షయ్ బాబు ఎక్కడికైనా తీసుకెళ్లమని అడిగాడు
సరే అక్షయ్ ని తీసుకువెల్దాము  అనుకుంటే సుజి , తన్వి కూడా ready ఐపోయారు బయటకు రావటానికి, ఇక తప్పక ముగ్గుర్ని తీసుకెళ్ళాను. French fries, chicken burger, pepsi order చేసాము. Food మాకు బాగా నచ్చింది. సుజి ఐతే fries ఇష్టంగా తిన్నాడు. 
అప్పటి నుంచి సుజి ఎప్పుడూ fries అడుగుతూ వుండే వాడు. ఇక తన్వి కి  కూడా బాగా నచ్చింది KFC experience. Aksay బాబు కి burger బాగా నచ్చింది. Burger తినటం first time అని చెప్పాడు. అక్షయ్ చిన్నప్పుడు కొత్తవి అంటే food గాని place గాని toy గాని నేనే పరిచయం చెయ్యాలి అక్షయ్ కి అని అనుకునేవాడిని అలా కొన్ని పరిచయం చేసాను, ఉదాహరణకి  laptop, scating scooter, remote car. మొత్తానికి burger కూడా పరిచయం చేశా. Food ఎంజాయ్ చేసిన తరువాత పిల్లలు పాండా ట్రైన్ ఎక్కారు. ఆ ride కూడా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ముగ్గురు. తర్వాత కృష్ణ ఒడ్డున పిల్లలు ముగ్గురు ఒక pic దిగారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి 10 అయ్యింది దగ్గర దగ్గర. ఇంటి దగ్గర చెల్లి, భవాని కాస్త కంగారు పడ్డారు కూడా. ఐతేనేమ్ మా adventure successful గా ముగిసింది. 
కూల్ గా కృష్ణ ఒడ్డున 


KFC FOOD ENJOY చేస్తూ 

జాలీ గా పాండా ట్రైన్ రైడ్ 

Comments

Popular posts from this blog

కొన్ని జ్ఞాపకాలు

సాయంత్రం సరదాగా