Happy birthday సుజి బంగారం

మా సుజి బంగారం 3rd birthday, november 6th 2022.ముందు రోజు బాబు కి dress కొనడానికి శుభమస్తు shopping mall కి వెళ్ళాము, భవాని సుజి కి dress select చేసింది, నాకు కూడా dress బాగా నచ్చింది, మా బాబు కి కూడా తెగ నచ్చేసింది dress. ఇక birthday special గా ఆ రోజు బిర్యానీ, సేమ్యా పాయసం చెయ్యాలి అనుకొంది భవాని దాని కోసం కూడా shoping చేసాము, ఇంటికి తిరిగి వచ్చాము.ఉదయం నిద్ర లేచాక, బాబు ని ఇద్దరం wish చేసాము, happy birthday అని చెబితే తిరిగి happy birthday అని చెప్పాడు మా బాబు. అలా కాదమ్మా happy birthday అని చెబితే thankyou అని చెప్పాలి అని నేను చెప్పాను, వెంటనే పట్టేసాడు, ఏదైనా చాలా త్వరగా నేర్చుకుంటాడు బాబు. మేము ముగ్గురం ready అయ్యి ముత్యాలంపాడు లో వున్న బాబా గుడి కి వెళ్ళాము, మా బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని బాబా ను వేడుకొన్నాము . 

బాబాకు భక్తి తో మొక్కుతున్న బాబు 
తరువాత ఏలూరు రోడ్ లో వున్న స్వీట్ shop లో మా బాబు కి birthday cake, sweets తీసుకొని ఇంటికి వచ్చాము.

 
బాబు birthday cake ఎంత బావుందో 
ఇక సాయంత్రం మళ్ళా స్నానాలు చేసి బాబు కి కొత్త బట్టలు వేసి cake cut చేయించాము, మా ఇంటి ఓనర్ కి, మా మిగతా tenets కి, కళావతి అమ్మమ్మ వాళ్ళ కి, నాగరాజు మావయ్య వాళ్లకి cake, sweets, పాయసం పంచాము. మా ఇంటి owner దేవి biscuit packet ఇచ్చింది సుజి కి. సుజి కి వాళ్ళ నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య, నాగలక్ష్మి అక్క, శేషగిరి మావయ్య, అక్షయ్ బావ, తన్వి వదిన, వినోద్ మావయ్య, మోనికా పిన్ని (donkey:సుజి బాబు, మోనికా కు పెట్టిన పేరు )మని చిన్నాన్న, ఇంకా దుర్గారావు మావయ్య సత్య అక్క అందరూ wishes చెప్పారు ఇంకా కొంతమంది whatsapp లో wish చేశారు. 
చిన్ను కి cake తినిపిస్తూ భవాని 

హంగులు, ఆర్భాటాలు లేకుండా చిన్ను birthday simple గా super గా celebrate చేసుకున్నాము. చిన్ను కి ఏదైనా gift ఇచ్చుంటే బావుండేది కానీ financial గా ఒడిదుడుకులు ఉండటం వలన ప్రత్యేకించి gift ఏమి ఇవ్వలేదు, చిన్ను కూడా gift కావాలని పట్టుబట్ట లేదు. అమ్మ వాళ్ళ ని పిలిచాము కాని రాలేకపోయారు. అత్తయ్య బాబు కి dress కొనమని 500 రూపాయలు ఇచ్చింది. మా బాబు birthday happy గా celebrate చేసుకున్నాము, విజయవాడ లో మొదటి సారి birthday చేసాము మాకు ఇదొక sweet memory. చిన్ను మూడు  birthday లు మూడు వేరు వేరు ఊళ్ళ లో జరిగాయి,1st birthday హుకుంపేట లో, 2nd birthday చోరంపూడి లో, ఇప్పుడు 3rd birthday విజయవాడ లో. చిన్ను బంగారం కి మరొక్కసారి happy birthday చెబుతూ మీ daady.




చిన్ను తో నేను 

Comments

Popular posts from this blog

చలో KFC

కొన్ని జ్ఞాపకాలు

సాయంత్రం సరదాగా