Water gun, what a gun
చిన్ను కి అప్పుడే toys గురించి కొంచెం అవగాహన వస్తూ వుంది, ఎందుకో గాని చాలా చిన్నతనం నుంచే చిన్ను కి toy guns అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా toy shop కి వెళ్తే gun కావాలని అడిగేవాడు. అలా చాలా guns కొన్నాడు. ఐతే చిన్నప్పుడు water లో బాగా ఆడేవాడు అందుకే water gun కొనాలి అనిపించింది ఏదో పని మీద రాజమండ్రి వెళ్ళినప్పుడు water gun కొన్నాను అది size లో కొంచెం పెద్దగానే వుంది. ఐతే ఇంటికి తీసికోచ్చాక water spray చెయ్యటానికి try చేస్తే spray అవ్వలేదు. Gun సరిగ్గా పనిచేయలేదు. చిన్ని బాబు సంతోషించాడు. తనకి ఆ gun పని చేయటం లేదు అనే అవగాహన అప్పటికి లేదు daady తన కోసం gun తెచ్చాడు అంతే అది చాలు అన్నట్టుంది బాబు వ్యవహారం. అయితే భవాని, నేను కొంచెం feel అయ్యాము అది సరిగ్గా work అవ్వలేదు అని. తరవాత ఒక శనివారం దొండపూడి వెళ్ళాము మేము ముగ్గురం, ప్రతి శనివారం సంత జరుగుతుంది దొండపూడి లో.అప్పుడప్పుడు అలా ముగ్గురం bike మీద దొండపూడి వెళ్తూ ఉండేవాళ్ళం, ముందు రాజంపాలం లో బాబా గుడికి వెళ్లి అక్కడ నుంచి దొండపూడి వెళ్ళేవాళ్ళం.సంత లో కూరగాయలు కొనుక్కునేవాళ్ళం. ఆకలేస్తే road పక్కన చల్ల బజ్జి, idly, మిరపకాయ బజ్జి తినేవాళ్ళం. Plate పది రూపాయలే. ఇప్పుడు ఇక్కడ(విజయవాడ )ధరలు చూసాక నిజంగానే మేము పది రూపాయలకే palte బజ్జి, plate idly తిన్నామా అనే doubt కచ్చితంగా వస్తుంది. ఆ రోజులు గడిచిపోయాయి మళ్ళా రావు, ఆ నేల కు మాకు ఋణానుబంధం తీరిపోయింది. మళ్ళా అక్కడ గడిపే అవకాశం వస్తుందో రాదో. ఇంతకీ అసలు విషయం లో కి వస్తే దొండపూడి సంత కు వెళ్ళినప్పుడు అక్కడ చిన్న water gun కొన్నాను చిన్ను కి. చిన్ను నే చూసి కావాలని అడిగాడు కొనిపెట్టాము. అది 20 రూపాయలు మాత్రమే కాని చాలా బాగా పని చేసింది. ఇంటికొచ్చాక దానితో భలే ఆడుకున్నాడు బాబు. ఆ gun తో చాలా రోజులు ఆడుకుంటున్నాడు, ఇప్పటికి అది బాగా పని చేస్తుంది. అప్పుడప్పుడు ఆ gun తో ఆడుతున్నాడు, వచ్చిన చిక్కల్లా ఒక్కటే ఆ gun తో మా మీదే నీళ్లు కొడతాడు, లేకపోతే ఇంట్లో floor మీద, అది కాకపోతే tv మీద నీళ్లు చల్లుతూ ఉంటాడు ఒక్కోసారి అల్లరికి హద్దు ఉండదు మా బాబు కి
![]() |
| Water gun, what a gun |

Comments
Post a Comment